About Us

About Us

మన భారతదేశం సువిశాల సుసంపన్న దేశమే కాకుండా ఎన్నో విలువైన ఖనిజములకు పుట్టినిల్లు. మన దేశంలో ఎన్నో దశాబ్దాల క్రితమే (17 వ శతాబ్దానికి పూర్వమే) గనుల త్రవ్వకాలు ప్రారంభించి, ప్రపంచ దేశాలకు వజ్రాలను ఎగుమతులు చేసేవారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రంతో పాటు అనేక విలువైన వజ్రములు మన దేశంలో వెలికితీయబడినవి. అందుకనే మన దేశం “రత్న గర్బ” గా కొనియాడబడుతుంది.

మన దేశంలో లభించే విలువైన ఖనిజములు, దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలలో పురోగతి సాధించడానికి, మౌళిక సదుపాయాల రూపకల్పనకు ఎంత గానో ఉపయోగపడుతున్నాయి. ఎన్నో విశేషాలు, విశిష్టతలు ఉన్నప్పటికీ, గనుల త్రవ్వకాలపై, ఖనిజముల వెలికితీత పై కొన్ని అపోహలు ఉండటం దురదృష్టకరం. మన దైనందిన జీవితంలో ఉదయం మెలుకువ అయినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు, గుండు సూది తయారీ నుండి ఖండాంతర క్షిపణి ల తయారీ వరకు, అలంకరణ ఆభరణాల తయారీ నుండి ఆకాశహర్మ్యాల నిర్మాణం వరకు ఖనిజముల వినియోగం అత్యంత అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఖనిజముల వినియోగం లేకుండా అభివృద్ది సాధించడం అసాధ్యం. 

కావున, ఖనిజముల వినియోగంపై అవగాహన కల్పించి, తద్వార దేశ అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషించాలనే మా ఈ ప్రయత్నం.